: భారత దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలి: మోడీ
భారత దేశంలో ప్రతి పేద కుటుంబానికి బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఢిల్లీలో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 7 కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఇవ్వాలనేది 'జన్ ధన్ యోజన' స్కీము లక్ష్యమని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందాలంటే వారికి బ్యాంకు ఖాతాలు ఉండడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు.