: మోడీ, నిర్మలాసీతారామన్, బాదల్ ను కలిసిన బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్ కు రాజధాని, ప్రత్యేక హోదా, రాష్ట్ర ఆర్థిక లోటును సరిదిద్దేందుకు అవసరమైన నిధులపై చర్చించారు. రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా ప్రధానిని బాబు అభ్యర్థించారు. కాగా, ప్రధానిని కలవడానికి ముందు చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, హర్షిమ్రాత్ కౌర్ బాదల్లను కలసి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితిని వివరించారు. చేపట్టాల్సిన జాతీయ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని, అధ్యయనాలు తొందరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.