: ప్రజా సంక్షేమానికే కేసీఆర్ తో పనిచేయాలని నిర్ణయించాం: బాబు
ప్రజా సంక్షేమం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలసి పని చేయాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రల ముఖ్యమంత్రులు గొడవపడితే ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత నెలకొనేందుకు కేసీఆర్ సముఖత వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. పరస్పరం గొడవ పడుతుంటే సమస్యలు పరిష్కారం కావని బాబు స్పష్టం చేశారు. విభజన జరిగి ఇంతకాలమైనా ఐఏఎస్, ఐపీఎస్ ల పంపిణీ ఇంకా పూర్తికాలేదని ఆయన మండిపడ్డారు.