: బీహార్లో ఎన్డీయేను కంగుతినిపించిన మహాకూటమి
తీవ్ర ఉత్కంఠ రేపిన బీహార్ శాసనసభ ఉపఎన్నికల్లో మహాకూటమి పైచేయి సాధించింది. 10 స్థానాలకు జరిగిన ఎన్నికలలో 6 స్థానాలను గెలుచుకుని ఎన్డీయేను వెనక్కి నెట్టింది. ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు నితీష్, లాలూ ఏకమైన సంగతి తెలిసిందే. బద్ధశత్రువులుగా పేరుపడ్డ వీరిద్దరూ ఎన్డీయే ఓటమికి సమష్టిగా ప్రచారం చేశారు. దీంతో మహాకూటమిని ఏర్పాటు చేసి కలిసివచ్చే ప్రతి పార్టీనీ, నేతను కలుపుకున్నారు. మోడీ ప్రభంజనంతో గెలుస్తామని భావించిన ఎన్డీయే నాలుగు స్థానాలను గెలుచుకుని ఫర్వాలేనిపించింది. ఆర్జేడీ 3 స్థానాల్లో, జేడీయూ 2, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించగా, బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్ పీ నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. మోడీని ఓడించేందుకు నితీష్, లాలూ ఎత్తుగడలు ఫలించాయి.