: ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉండవు: జైపాల్ రెడ్డి
ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతాలు స్థిరంగా ఉండవని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, నాస్తికవాద పార్టీలుగా పేరుపడ్డ డీఎంకే, అన్నాడీఏంకే కూడా బీజేపీతో రాజీపడ్డాయని అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీతో రాజీ కుదుర్చుకున్నాయని ఆయన తెలిపారు. రేపు టీఆర్ఎస్ కూడా బీజేపీతో పొత్తుకట్టదని భావించడం లేదని అన్నారు. కనుక ప్రజల హక్కులు కాపాడేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని ఆయన పేర్కొన్నారు.