: పరిశ్రమలకు రెండు రోజులు విద్యుత్ ఆపేస్తాం: కేటీఆర్


తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సమస్యలకు గతంలో పాలించిన ప్రభుత్వాలే కారణమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలకు రెండు రోజలు పవర్ హాలీడే ప్రకటించి రైతులకు విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మిగులు విద్యుత్ ను కొంటామని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే విద్యుత్ గ్రిడ్ కు అనుసంధానించి ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News