: పాక్ పై చర్యలు తీసుకోవాలి: శివసేన


పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంపై శివసేన మండిపడింది. శివసేన పత్రిక సామ్నాలో పాక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. హద్దుమీరుతున్న పాక్ కు ముకుతాడు వేయాలంటే సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ముందుగా పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేసి కాల్పుల విరమణ ఒప్పందంపై సమగ్రంగా మాట్లాడాలని సూచించింది. పాక్ రెచ్చగొట్టడం, మనం చేతులు ముడుచుకుని కూర్చోవడం బలహీనతగా భావించవద్దని సూచించాలని సామ్నా పేర్కొంది.

  • Loading...

More Telugu News