: కాంగ్రెస్ నేతలను గెలిపిస్తానంటూ ఓ వ్యక్తి బంపర్ ఆఫర్
అష్టకష్టాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలను గెలిపిస్తానని ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడంలో తాను నిష్ణాతుడ్నని, అగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నేతను గెలిపిస్తానని అతను పేర్కొన్నాడు. అయితే అందుకో షరతు విధించాడు. తనకు 8 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. బీహార్ లోని ఇండోర్ లో అతిన్ తివారీ (40) అనే వ్యక్తి ఫిట్ నెస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఇతను అగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ గోర్ ను గెలిపిస్తానని ఫోన్ చేశాడు. దీంతో అతను పోలీసులకు సమాచారమిచ్చారు. అతనిని చాకచక్యంగా కాఫీ షాపు వద్దకు రప్పించిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు.