: సెక్యూరిటీని వదిలేసి బుల్లెట్ పై షికారు చేసిన తెలంగాణ మంత్రి


తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు గౌడ్ తన చర్యతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. చుట్టూ ఉన్న భద్రత సిబ్బందిని వదిలేసి, ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ ఎక్కి షికారు బయల్దేరారు. అర్థరాత్రి వేళ పంజాగుట్ట-సికింద్రాబాద్ రోడ్డుపై మంత్రివర్యులు దూసుకెళ్ళడం విశేషం. పార్టీ కార్యకర్తల కోరిక మేరకే మంత్రి బుల్లెట్ నడిపారట. ఆయన వెంట కార్యకర్తలు కూడా ర్యాలీ మాదిరే బయల్దేరారు. వెనుక ఓ కార్యకర్తను కూర్చోబెట్టుకున్న మంత్రిగారు ఉత్సాహంగా బుల్లెట్ నడపడం విశేషం.

  • Loading...

More Telugu News