: టీ కాంగ్రెస్ మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా జానారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. అంతేగాక, పార్టీ తరపున అభ్యర్థిని కూడా జానానే ఎంపిక చేస్తారని దిగ్విజయ్ చెప్పారు. పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మెదక్ నియోజకవర్గంలోని గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తారన్నారు. కాగా, మెదక్ లోక్ సభ స్థానంలో పోటీచేసే అభ్యర్థిని రేపు ప్రకటిస్తామని డిగ్గీ తెలిపారు.