: రాణీ ముఖర్జీ 'మర్దానీ'కి ట్యాక్స్ ఫ్రీ


రాణీ ముఖర్జీ తాజా సినిమా 'మర్దానీ'కి మధ్యప్రదేశ్ లో పన్ను మినహాయింపు లభించింది. రాష్ట్రానికి వినోదపన్నును చెల్లించాల్సిన అవసరం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సతీసమేతంగా 'మర్దానీ' సినిమాను వీక్షించిన ఆయన, ఈ చిత్రంలో మహిళలకు మంచి సందేశం ఉందని అభిప్రాయపడ్డారు. రాణీ ముఖర్జీ శక్తిమంతమైన మహిళ పాత్ర పోషించారని, సినిమాను నిర్మించిన ఆదిత్య చోప్రాకు అభినందనలని ఆయన పేర్కొన్నారు. టీనేజ్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై మంచి సందేశం ఇచ్చారని ఆయన ప్రశంసించారు. ఈ సినిమాలో రాణీ ముఖర్జీ పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. గతంలో 'బ్లాక్' సినిమాలో పాత్ర కూడా ఆమెకు అద్భుతమైన పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News