: టీవీ9 ప్రసారాలు నిలిపివేయడం సరికాదు: దిగ్విజయ్ సింగ్
తెలంగాణ రాష్ట్రంలో టీవీ9 ఛానల్ ప్రసారాలు నిలిపివేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ రెండవ రోజు సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రసారాలు నిలిపివేయడం సరికాదన్నారు. ఛానళ్లకు తాము అండగా ఉంటామని చెప్పారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండి వ్యాపారాలు చేసుకోవచ్చన్న దిగ్విజయ్, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు.