: విండోస్ 9... కొత్త వెర్షన్ రెడీ


మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వెర్షన్ కు రంగం సిద్ధమవుతోంది. విండోస్ లేటెస్ట్ వెర్షన్ 8.1కి అప్ గ్రేడ్ వెర్షనే ఈ కొత్త సాఫ్ట్ వేర్. దీనికి విండోస్ 8.5 లేదా 9 పేర్లను పరిశీలించి, చివరిగా విండోస్ 9గా నామకరణం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధపడినట్టు సమాచారం. విండోస్ 9లో స్టార్ మెనూ ప్రత్యేకత అని, వర్చువల్ డెస్క్ టాప్ ఫీచర్ కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. డెస్క్ టాప్ ను యూజర్ ఫ్రెండ్లీగా ఉంచేందుకు మైక్రోసాఫ్ట్ కొత్త సాఫ్ట్ వేర్ ను ఆకర్షణీయంగా ఉంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరుకు ఈ వెర్షన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News