: తుమ్మల పార్టీ వీడకుండా నారా లోకేష్ ప్రయత్నాలు
ఖమ్మం జిల్లాకు చెందిన టీ.టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై నారా లోకేష్ దృష్టి పెట్టారు. పార్టీ వీడకుండా ముందుగానే ఆయనతో చర్చలు జరపాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు తుమ్మలను బుజ్జగించి పార్టీలో ఉండేలా చేయాలని చెప్పారట. మూడు రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు లోనై యశోదా ఆసుపత్రిలో చేరిన తుమ్మలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించిన సంగతి తెలిసిందే.