: రోడ్డు మీదే కాదు గాల్లో కూడా యాక్సిడెంట్లవుతాయి... విమానాలు గుద్దుకున్నాయి


రోడ్డుపైన యాక్సిడెంట్లు సర్వసాధారణం. దానికి కారణాలు సవాలక్ష! కానీ, ఆకాశంలో యాక్సిడెంట్లు, అంటే విమానాలు గుద్దుకోవడం ఎప్పుడో కానీ జరగదు. తాజాగా అలాంటి ప్రమాదం సంభవించింది. స్విట్జర్లాండ్ గగనతంలో ఎగురుతున్న రెండు ఛార్టర్డ్ ఫ్లైట్ లు గాల్లో ఒకదాన్నొకటి డీకొట్టాయి. దీంతో, విమానంలో ఉన్న ఆరుగురు గాయపడ్డారు. ఆ రెండింటిలో ఒక విమానం సెయింట్ గాలెన్లోని కాంటన్ ప్రాంతంలో ఓ పొలంలో కూలిపోగా, అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండో విమానం అక్కడకు సమీపంలో ఉన్న సిట్టర్డార్ప్ ప్రాంతంలో అత్యవసరంగా ల్యాండైంది. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే రెండు విమానాలు ఇలా ఢీకొనడానికి కారణాలు తెలియరాలేదు. తప్పు పైలట్లదా?, లేక కంట్రోల్ రూందా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News