: టర్కీ నూతన అధ్యక్షుడికి 'కంగ్రాట్స్' చెప్పిన ప్రణబ్
టర్కీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ ప్రధాని రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎర్డోగాన్ కు ఓ సందేశం పంపారు. "మీరు రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భారతదేశ ప్రజల తరపున, నా తరపున శుభాకాంక్షలు తెలపడానికి సంతోషిస్తున్నాను" అని పేర్కొన్నారు. గతేడాది తాను టర్కీలో పర్యటించినప్పటి స్మృతులను కూడా ప్రణబ్ తన సందేశంలో ప్రస్తావించారు.