: గుర్తింపు రద్దయిన తెలంగాణ ఇంజినీరింగ్ కళాశాలలకు స్వల్ప ఊరట
గుర్తింపు రద్దు కారణంగా ఎంసెట్ కౌన్సెలింగ్ జాబితాలో చోటు కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలోని 174 ఇంజినీరింగ్ కళాశాలలకు ఉమ్మడి హైకోర్టులో స్వల్ప ఊరట కలిగింది. ఈ మేరకు అర్హత ఉన్న కళాశాలల పేర్లను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తమను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని కోరుతూ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు శనివారం ముగిశాయి. ఈ మేరకు నేడు తీర్పు వెలువరించిన న్యాయస్థానం, ఏఐసీటీఈ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా జేఎన్ టీయూ-హెచ్ కు సూచించింది. అంటే, వారంరోజుల్లోగా సదరు కళాశాలలు అఫిడవిట్లు దాఖలు చేస్తే, పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న కళాశాలల పేర్లను జాబితాలో చేర్చనున్నారు.