: దేశంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు
దేశంలో 1993 నుంచి 2009 వరకు జరిగిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నింటినీ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ ఎం లోథా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల ధర్మాసనం తీర్పు వెలువరించింది. జరిగిన 218 బొగ్గు గనుల కేటాయింపుల్లో పారదర్శకత లేదనీ, అన్నీ చట్టవిరుద్ధంగా జరిగాయని పేర్కొంది. కేటాయింపులపై మరింత విచారణ జరగాలని చెప్పింది. ఇక నుంచి బొగ్గు క్షేత్రాలు ఎలా కేటాయించాలనేది కోర్టు నిర్ణయిస్తుందని తెలిపింది. కాగా, బొగ్గు క్షేత్రాల కేటాయింపు విధివిధానాలను కోర్టు సెప్టెంబర్ 1న వెల్లడించనుంది.