: ధోనీ వ్యాఖ్యలపై బీసీసీఐ సీరియస్!


వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ వరకు టీమిండియా కోచ్ గా డంకన్ ఫ్లెచర్ కొనసాగుతాడన్న కెప్టెన్ ధోనీ వ్యాఖ్యలను బీసీసీఐ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కోచ్ గా ఎవరుండాలో ధోనీ నిర్ణయించలేడని బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. కోచ్ విషయం బీసీసీఐ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. వచ్చే వరల్డ్ కప్ కు టీమిండియా కోచ్, కెప్టెన్ గా ఎవరు వ్యవహరించాలనేది సెలక్షన్ కమిటీ చూసుకుంటుందని అన్నారు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ చేజార్చుకున్న నేపథ్యంలో ధోనీ, ఫ్లెచర్ లపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. కెప్టెన్ గా ధోనీ, కోచ్ గా ఫ్లెచర్ పనికిరారంటూ మాజీ క్రికెటర్లు ఎలుగెత్తారు. ఈ క్రమంలో బీసీసీఐ టీమిండియా కోచింగ్ డైరక్టర్ గా రవిశాస్త్రిని నియమించింది. అంతేగాకుండా, విండీస్ తో సిరీస్ కల్లా తప్పుకుంటే మేలన్న సంకేతాలను పంపింది ఫ్లెచర్ కు.

  • Loading...

More Telugu News