: ఢిల్లీ పార్కుల్లో ఓపెన్ జిమ్ లు!
దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) సరికొత్త విధానానికి తెరదీస్తోంది. ఇకపై, పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు రూపంలో ఈ బహిరంగ వ్యాయామశాలలను ప్రతి వార్డులోనూ ఏర్పాటు చేస్తారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) 'గో గ్రీన్ ఓపెన్ జిమ్' ప్రాజెక్టు పేరిట లోథీ గార్డెన్, నెహ్రూ పార్క్ వంటి ప్రదేశాల్లో ఈ తరహా వ్యాయామశాలలు ఏర్పాటు చేసింది. వీటి స్ఫూర్తిగా ఎస్డీఎంసీ తాజా నిర్ణయం తీసుకుంది. 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.6 లక్షల వ్యయంతో జిమ్ ఏర్పాటు చేస్తారు. వీటిలో 12 రకాలు వ్యాయామ పరికరాలు అందుబాటులో ఉంటాయి. దీనిపై దక్షిణ ఢిల్లీ కౌన్సిలర్ రాధేశ్యాం మాట్లాడుతూ, వీటికి పైకప్పు అవసరంలేదని, కరెంటుతో పనిలేదని తెలిపారు.