: పల్లె వెలుగు బస్సుల స్థానంలో మినీ బస్సులు: ఏపీ మంత్రి సిద్ధా


ఆర్టీసీలో ఇంధన ఖర్చులు తగ్గించుకోవడం కోసం బయోడీజిల్ వినియోగించే ఆలోచన ఉందని ఏపీ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు చెప్పారు. పల్లె వెలుగు బస్సుల స్థానంలో మినీ బస్సులను ప్రవేశపెడతామని వెల్లడించారు. కర్ణాటక ఆర్టీసీని అధ్యయనం చేయడానికి ఒక బృందం ఆ రాష్టానికి వెళుతుందని చెప్పారు. నిరుపయోగంలో ఉన్న ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News