: 'న్యాయమూర్తుల నియామక బిల్లు'పై పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం


కొలీజీయం వ్యవస్థ స్థానంలో తీసుకొచ్చిన 'న్యాయమూర్తుల నియామక బిల్లు'ను వ్యతిరేకిస్తూ దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బిల్లు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్లపై విచారణచేసి ఎంటర్ టైన్ చేయలేమని పేర్కొంది. అయితే, పిటిషన్ దారులు ప్రభుత్వ నిర్ణయాన్ని తరువాత దశలో సవాల్ చేయవచ్చని తెలిపింది. కాగా, దాఖలైన ప్రత్యేక పిటిషన్లు కాలం ముగిసినవిగా ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ చెప్పారు. సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం న్యాయ కమిషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News