: ఎన్జీరంగా వర్సిటీ వీసీ నివాసాన్ని ముట్టడించిన టీ విద్యార్థులు
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం ఉప కులపతి నివాసాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ముట్టడించారు. ఎన్జీ రంగా వర్సిటీకి అధికారికంగా ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని విద్యార్థులు ధర్నాకు దిగారు. అనంతరం వీసీకి వినతిపత్రం అందజేశారు. రంగా వర్సిటీకి జయశంకర్ పేరు మార్చుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇంకా అధికారికంగా మారలేదు.