: కట్, కాపీ అండ్ పేస్ట్ పద్ధతిలో తొలి బడ్జెట్ ను రూపొందించారు: జగన్
శాసనసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరును విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ ప్రజలకు పూర్తి నిరాశను మిగిల్చిందని ఆయన అన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ భరోసా కల్పించలేకపోయిందన్నారు. కట్, కాపీ అండ్ పేస్ట్ పధ్ధతిలో బడ్జెట్ ను తయారుచేశారని ఆరోపించారు. ప్రణాళిక వ్యయాన్ని తగ్గించి చూపకపోవడం వల్ల... జీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.