: చంద్రబాబు రుణమాఫీ అమలు చేయలేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: జగన్
చంద్రబాబు రుణమాఫీని అమలు చేయలేకపోవడంతో... బ్యాంకులు రైతుల మీద అప్పులు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాయని జగన్ ఆరోపించారు. అప్పులు తీర్చలేని కారణంగా రైతులు మళ్లీ బ్యాంకుల దగ్గరకు వెళ్లలేకపోతున్నారన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో... రైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకుంటారన్నారు. బడ్జెట్ లో రైతులకు కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో... ఈ ఏడాది, వచ్చే ఏడాది కలిపి లక్షకు 24 వేల రూపాయల వడ్డీ కట్టాల్సిన దుస్థితిలో రైతులు ఉన్నారని జగన్ పేర్కొన్నారు.