: గూగుల్ కంటే ఇదే బెటరట!
వరల్డ్ క్లాస్ కార్పొరేట్ సంస్థల్లో పని సంస్కృతి, విలువలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయమై గ్లాస్ డోర్.కామ్ ఓ సర్వే చేపట్టింది. అందులో, ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కు అగ్రపీఠం దక్కింది. ఆయా సంస్థలకు చెందిన ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వారు తాము పనిచేస్తున్న సంస్థలో పని సంస్కృతి, విలువలు ఎలా ఉన్నాయన్న విషయమై రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం 1-5 పాయింట్లతో ఓ స్కేల్ ఏర్పాటు చేయగా... ట్విట్టర్ 4.5 పాయింట్లతో నెంబర్ వన్ గా నిలిచింది. తర్వాత స్థానాల్లో పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ఎడిల్ మాన్, సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ నిలిచాయి. ఈ రెండు సంస్థలు మొత్తం ఐదు పాయింట్లకు గాను 4.4 పాయింట్లు సాధించాయి.