: చంద్రబాబు హయాంలో ఏ విత్తనాలు మొలకెత్తలేదు: జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అసెంబ్లీలో ప్రతిపక్షనాయుడు జగన్ విరుచుకుపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా చంద్రబాబు ఓ సరికొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. తాను వేసిన అభివృద్ధి విత్తనాలన్నీ... రాజశేఖరరెడ్డి హయాం నాటికి మొలకలెత్తాయని, ఆ ఫలాల వల్లే ఆయన పాలనలో అభివృద్ధి రేటు నమోదైందని చంద్రబాబు చెప్పారన్నారు. అంటే, తొమ్మిది సంవత్సరాల పాటు చంద్రబాబు పాలనలో వరుసపెట్టి విత్తనాలు వేస్తూనే ఉన్నా... ఒక్కటి కూడా మొలకెత్తలేదని, తర్వాత రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అవి మొలకలెత్తాయని, దాని కారణాలు ఏంటో అందరికీ తెలుసని ఆయన చంద్రబాబుపై చురకలు వేశారు. జగన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వైసీపీ సభ్యురాలు రోజా తదితరులు 'చంద్రబాబు హయాంలో అంతా కరవే' అంటూ బల్లలు చరిచారు.