: వృద్ధిరేటుతో పాటు అవినీతి రేటు, దోపిడీ రేటుపై కూడా జగన్ మాట్లాడాలి: యనమల


వైకాపా అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సెటైర్లు విసిరారు. సభలో వృద్ధిరేటు గురించి మాట్లాడుతున్న జగన్... అవినీతి రేటు, దోపిడీ రేటు గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పేవన్నీ అసత్యపు లెక్కలని అన్నారు. చంద్రబాబు, వైఎస్ పాలనల మధ్య వ్యత్యాసాలపై మాట్లాడటానికి సొంత లెక్కలు వద్దని జగన్ కు సూచించారు. బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంలో, ఈ వ్యాఖ్యలు చేశారు. తాము జగన్ మాదిరి సభ నుంచి పారిపోలేదని... పారిపోయే తత్వం తమది కాదని... జగన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని అన్నారు.

  • Loading...

More Telugu News