: సీఎంగా చంద్రబాబుకు 57 మార్కులు, వైయస్ కు 96 మార్కులు వచ్చాయి: జగన్


తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన కంటే వైఎస్ హయాంలోనే అభివృద్ధి బాగా జరిగిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో జీడీపీ తగ్గి అప్పులు పెరిగాయని ఆయన ఆరోపించారు. అలాగే, చంద్రబాబు పాలనలో ఆస్తులు బాగా తగ్గాయని... వైఎస్ పాలనలో ప్రభుత్వ ఆస్తులు బాగా పెరిగాయన్నారు. తొమ్మిదేళ్ల బాబు హయాంలో 21,994 కోట్ల రెవెన్యూ లోటు రాష్ట్రానికి వచ్చిందన్నారు. కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబుకు కేవలం 57 మార్కులే వచ్చాయని... కానీ, 2004నుంచి 2009 మధ్య పాలనలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమోఘంగా 96 మార్కులు తెచ్చుకున్నారని జగన్ తెలిపారు. 2009-2014 మధ్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం 68 మార్కులు తెచ్చుకుందన్నారు.

  • Loading...

More Telugu News