: బళ్లారి, పాటియాల అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం
కర్ణాటకలోని బళ్లారి గ్రామీణ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. బీజేపీ అభ్యర్థి ఓబులేశుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాలకృష్ణ 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు పంజాబ్ లోని పాటియాల శాసనసభ నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్సే దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ప్రణీత్ కౌర్ 23 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక బీహార్ లో బీజేపీ ఆరు, ఆర్జేడీ-జేడీయూ అలయెన్స్ మూడు, కాంగ్రెస్ ఒక్క స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.