: మందు కొడితే హ్యాంగోవర్ వేధిస్తోందా..? తప్పంతా మీ జన్యువులదే!
మద్యపానం తర్వాత కొందరు విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు. హ్యాంగోవర్ గా పిలుచుకునే ఈ శిరోభారాన్ని అనుభవిస్తేనే కానీ తెలియదు దాని తీవ్రత ఎలా ఉంటుందో..! మందుబాబులను వేధించే ఈ పెను సమస్యపై అమెరికా పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. దాంట్లో వారు తెలుసుకున్న విషయం ఏంటంటే... హ్యాంగోవర్ తలెత్తడానికి జన్యువులే ముఖ్య కారణమట. అధ్యయనంలో భాగంగా ఏడాదిగా కొందరి మద్యపానం అలవాట్లను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఒకే పరిమాణంలో మద్యం స్వీకరించినప్పుడు ఒకరికి హ్యాంగోవర్ రావడం, మరొకరికి రాకపోవడాన్ని గుర్తించారు. దానిపై మరింత లోతుగా పరిశోధిస్తే జన్యువులే సగం కారణమని తెలిసింది. మిగతా సగం... వ్యక్తుల మానసిక స్థితి, సమాజం వారిపై చూపే ప్రభావాలు హ్యాంగోవర్ కు కారణమవుతాయని తేలింది.