: హమాస్ కీలక నేతను హతం చేశాం: ఇజ్రాయెల్


హమాస్ కీలక నేతల్లో ఒకరైన మొహమ్మద్ అల్-గుల్ ను అంతమొందించామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ కు చెందిన ఆర్థిక వ్యవహారాలన్నింటినీ గుల్ పర్యవేక్షించేవాడని తెలిపింది. గుల్ మరణాన్ని పాలస్తీనా డాక్టర్లు కూడా ధ్రువీకరించారు. "ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే గుల్ హమాస్ నెల్ వర్క్ లో అత్యంత కీలకమైన వ్యక్తి. హమాస్ కు అవసరమైన నిధులను చేరవేయడం, టెర్రరిస్టులకు అవసరమైన టన్నెల్స్ లాంటి మౌలిక వసతులను కల్పించడంలో గుల్ దే కీలకపాత్ర. ఇజ్రాయెల్ టార్గెట్లలో గుల్ కూడా ఒకరు" అని ఇజ్రాయెల్ ఆర్మీ స్పోక్స్ మెన్ మేజర్ ఆర్యే షాలికార్ తెలిపారు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు 135 రాకెట్లను ప్రయోగించారని చెప్పారు.

  • Loading...

More Telugu News