: ఆకతాయికి యూపీ యువతుల దేహశుద్ధి!


ఉత్తర ప్రదేశ్ లో మహిళలపై వికృతంగా దాడులకు దిగుతున్న మగాళ్లకు తగిన బుద్ధి చెప్పేందుకు ఆ రాష్ట్ర మహిళలు సిద్ధమైనట్లే ఉంది. మృగాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతేనేం, మమ్మల్ని మేం రక్షించుకోగలం అంటూ యూపీ యువతులు ఆదివారం నాటి ఘటనతో నిరూపించారు. అఖిలేశ్ ప్రభుత్వం సిగ్గుపడేలా ధైర్యసాహసాలను చూపారు. రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకున్న ఆ ఘటనలో... కొంతమంది యువతుల బృందం ఓ ఆకతాయిపై మూకుమ్మడిగా విరుచుకుపడింది. బహిరంగంగా జరిగిన జరిగిన ఈ దాడితో సదరు ఆకతాయి నిశ్చేష్టుడిగా నిలబడటం మినహా ఏమీ చేయలేకపోయాడు. అప్పటికే అపర కాళికల్లా ఆకతాయి పైకి లంఘించిన యువతులు చేయి, చెప్పు అన్న తేడా లేకుండా ఎడాపెడా బాదేశారు. ఈ చర్యతో అఖిలేశ్ సర్కారుతో పాటు రాష్ట్ర పోలీసులకు యువతులు గుణపాఠం చెప్పినట్టైంది.

  • Loading...

More Telugu News