: ప్రపంచ కప్ దాకా టీమిండియా కోచ్ ఫ్లెచరే!: ధోనీ
టీమిండియా కోచ్ పదవిపై కొనసాగుతున్న ఊహాగానాలకు కెప్టెన్ ధోనీ తెర దించాడు. 2015 ప్రపంచ కప్ దాకా టీమిండియాకు డంకన్ ఫ్లెచరే కోచ్ గా వ్యవహరిస్తారని ప్రకటించాడు. తద్వారా కోచ్ పదవి నుంచి ఫ్లెచర్ ను తప్పిస్తారన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్ లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ, కొత్తగా సృష్టించిన డైరెక్టర్ పదవిలో రవి శాస్త్రిని నియమించింది. దీంతో ఫ్లెచర్ కూడా తప్పుకోకతప్పదన్న ప్రచారమూ జరిగింది. అయితే అలాంటి పరిస్థితేమీ లేదన్న ధోనీ, అన్నీ గతంలోలాగే సాఫీగానే సాగిపోతున్నాయని చెప్పాడు. రవిశాస్త్రి నియామకాన్ని స్వాగతించిన ధోనీ, ఫ్లెచర్ పదవికొచ్చిన ముప్పేమీ లేదని తేల్చిచెప్పాడు.