: కుర్చీని ఎప్పుడూ వదలకూడదనే విషయం నేర్చుకున్నా: కేజ్రీవాల్


నిండా మునిగిన తర్వాత గానీ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు తత్వం బోధపడలేదు. ముఖ్యమంత్రిగా ఉండమంటూ ఢిల్లీ ప్రజలు అధికారం అప్పగిస్తే... కేవలం 49 రోజులకే చాప చుట్టేశారు కేజ్రీవాల్. ఆ తర్వాత గానీ ఆయనకు రాజకీయం అంటే ఏమిటో అర్థంకాలేదు. నిన్న ఢిల్లీలో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ, "రాజకీయాలకు కొత్త కావడంతో కొన్ని తప్పులు చేశాం. ముఖ్యంగా కుర్చీ విలువ ఏంటో తెలిసొచ్చింది. కుర్చీని ఎప్పుడూ వదలరాదనే విషయం అవగతమైంది. ఈ సారి అధికారంలోకి వస్తే... కుర్చీని మాత్రం వదలం. ఐదేళ్లు పాలిస్తాం" అని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే... ఢిల్లీలో 47 శాతం ఓట్లు తమకే పడతాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News