: టీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి ఎవరో నేడు తేలిపోనుంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో నేడో తేలిపోనుంది. రాత్రి సింగపూర్ నుంచి కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమవుతారు. బుధవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో, ఈ భేటీలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. దేవీప్రసాద్, శేరి సుభాష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరు దాదాపు ఖరారయినట్టు తెలుస్తోంది.