: స్టేడియంలో అభిమానులు ఆ ఆటగాడిని చంపేశారు
అల్జీరియా రాజధాని అల్జీర్స్ లో జరుగుతున్న ఆ దేశ ఫుట్ బాల్ పోటీల్లో దారుణం చోటుచేసుకుంది. ఆట చూస్తున్న అభిమానులు ఓ ఆటగాడ్ని చంపేశారు. కబిలై జట్టు ప్రత్యర్థి జట్టుతో 2-1గోల్స్ తేడాతో ఓటమిపాలవ్వడంతో తట్టుకోలేకపోయిన ఆ జట్టు అభిమానులు ఆగ్రహించారు. దీంతో కబిలై క్లబ్ తరపున ఆడుతున్న కామెరూన్ కు చెందిన ఆటగాడు అల్బర్ట్ ఎల్బొస్సె పై ప్రేక్షకులు కొన్ని వస్తువులు విసిరారు. ఓ వస్తువు నేరుగా అల్బర్టో తలకు తగలడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు చూసి అక్కడే ఉన్న వైద్యులకు తెలపగా, వారు చూసి అతను మరణించినట్టు నిర్థారించారు. దీనిపై క్రీడా ప్రపంచం మొత్తం భగ్గుమంటోంది. అభిమానానికి హద్దు ఉండాలని మండిపడుతోంది. క్రీడలను క్రీడల్లా చూడాలని, పరువు ప్రతిష్ఠలుగా భావించకూడదని నిపుణులు హితవు పలుకుతున్నారు.