: బోధన సవాళ్లతో కూడుకున్నది: స్మృతీఇరానీ


ఈ రోజుల్లో బోధన సవాళ్లతో కూడుకున్నదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మారుతున్న విద్యావ్యవస్థకు అనుగుణంగా ఉపాధ్యాయులు శిక్షణ పొందాలని అన్నారు. గురుశిష్యుల బంధం విడదీయరానిదని పేర్కొన్న ఆమె, ప్రధాని నరేంద్ర మోడీ ఆశించిన విధంగా మేడిన్ ఇండియా కార్యక్రమానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. 2015 ఫిబ్రవరి 21న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మాతృభాషా దినోత్సవం పాటించనున్నామని స్మృతీ ఇరానీ తెలిపారు.

  • Loading...

More Telugu News