: రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతా: మంత్రి నారాయణ


రేపటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తెలిపారు. రేణిగుంట విమానాశ్రయంలో అస్వస్థతకు గురైన ఆయన వైద్యసేవలతో కోలుకున్న అనంతరం మాట్లాడుతూ, తాను ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. రోడ్డు మార్గంలో చెన్నై వెళ్లి అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకుంటానని నారాయణ తెలిపారు. రేణిగుంటలో విమానం రన్ వేపై నుంచి బయల్దేరి అనంతరం ఆయన అస్వస్థతకు గురవ్వడంతో విమానాన్ని వెనక్కి మళ్లించి రేణిగుంట విమానాశ్రయంలో వైద్యసేవలు అందించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News