: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడి భూరి విరాళం


సంపద పెంచుకుని మురిసిపోయేవారు మనచుట్టూ ఉంటారు. అయితే సంపాదించిన ప్రతి రూపాయిని ఇతరుల ఉన్నతి కోసం ఖర్చుచేసి మానవత్వం చాటుకునే మహానుభావులు కొంతమందే వుంటారు. తాజాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎస్ డీ శిబులాల్ భూరి విరాళం ప్రకటించి, తన గొప్ప మనసు చాటుకున్నారు. దాతృత్వ కార్యక్రమాల కోసం తమ ఫౌండేషన్లకు రూ.36 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు శిబురాల్, ఆయన సతీమణి కుమారి శిబురాల్ వెల్లడించారు. 36 కోట్ల రూపాయలను అనాధ పిల్లలకు సేవలందిస్తున్న సరోజిని దామోదరన్ ఫౌండేషన్(ఎస్ డీఎఫ్), అద్వైత ఫౌండేషన్ లకు ఇస్తున్నట్టు కుమారి శిబురాల్ తెలిపారు. 1995 నుంచి ఎస్ డీఎఫ్ ఏర్పాటు చేసి, శిబులాల్ దంపతులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనాధ పిల్లలకు విద్యనందించే ఈ ఫౌండేషన్లు ఇప్పటి వరకు 3,306 విద్యార్థులకు చేయూతనందించాయి.

  • Loading...

More Telugu News