: కొత్త ప్రయోగానికి తెరతీసిన కొచ్చి విమానాశ్రయం... రంగంలోకి రోబోలు
కేరళలోని కొచ్చి విమానాశ్రయం కొత్త మార్గంలో పయనిస్తోంది. ప్రయాణికులకు పటిష్ఠమైన భద్రత అందజేసేందుకు కొచ్చి విమానాశ్రయాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిని వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు. వారి ప్రణాళిక ప్రకారం, రోబోటిక్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా విమానాశ్రయానికి పటిష్ఠ భద్రత కల్పించనున్నారు. ఈ రోబోలు అగ్నిప్రమాదాలను, పేలుడు పదార్థాలను దీటుగా ఎదుర్కోగలవు. విమానం హైజాక్ అయితే ప్రయాణికులను విడుదల చేయగలవు. 12 కోట్లు ఖర్చుచేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణాదిలో ఇలాంటి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయనున్న తొలి విమానాశ్రయం కొచ్చి కావడం విశేషం.