: పోలీస్ ఆధికారి ఇంటివద్ద 5 కేజీల టిఫిన్ బాక్స్ బాంబు


ఒడిశాలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఓ భారీ టిఫిన్ బాక్స్ బాంబును వెలికి తీశారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాచ్ ఖండ్ లోని పోలీసు అధికారి నివాసం వద్ద టిఫిన్ బాక్స్ బాంబు బయటపడింది. ఈ టిఫిన్ బాక్స్ బాంబును మావోయిస్టులు పోలీసు అధికారుల్ని మట్టుబెట్టేందుకు అతని నివాసం వద్ద అమర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీని బరువు 5 కేజీలు ఉంటుంది. ఇది పేలితే పెను విపత్తు సంభవించేది. సుందరమైన ప్రకృతి, సహజసిద్ధమైన వాటర్ ఫాల్స్ తో అలరారే మాచ్ ఖండ్ లో బాంబుదొరకడంతో కలకలం రేగింది. అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ మావోల ప్రాబల్యం ఎక్కువ.

  • Loading...

More Telugu News