: డిపో మేనేజర్ కు దేహశుద్ధి చేయబోయిన కార్మికులు


డిపో మేనేజర్ పై ఆగ్రహంతో రగిలిపోయిన ఆర్టీసీ కార్మికులు అతనికి దేహశుద్ధి చేయబోయిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు వేస్తున్నారనే కారణంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనతో ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత నెలకొని ఉంది. ఓ దశలో కార్మికులు డిపో మేనేజర్ సుధాకర్‌పై దాడికి యత్నించారు. సహచరులు అడ్డుకోవడంతో దాడి జరగలేదు. డిపో మేనేజర్ వ్యవహారసరళి మార్చుకోకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News