: ఎర్రబెల్లి ఇంట్లో సమావేశమైన తెలంగాణ బీజేపీ, టీడీపీ నేతలు
తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసంలో సమావేశమయ్యారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్ రమణ, రేవంత్‌రెడ్డితో పాటు బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఎంపీ దత్తాత్రేయ, నాగం సహా మరికొంతమంది నేతలు భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. మెదక్ లో పోటీ చేసే అవకాశం బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఎప్పటి నుంచి మొదలుపెట్టాలి? వ్యూహాలు ఏ రకంగా ఉండాలి? అనే విషయాలను వీరు చర్చిస్తున్నారు.