: పాక్ తెంపరితనానికి కళ్లెం వేస్తాం: జైట్లీ
సరిహద్దుల్లో పాక్ తెంపరితనానికి కళ్లెం వేస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. జైపూర్ లోని 'ముర్షిదాబాద్ క్యాంపస్ ఆఫ్ మేనేజ్ మెంట్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్'ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదేపదే హద్దుమీరుతున్న పాక్ కు గట్టి గుణపాఠం చెబుతామని అన్నారు. పాక్ కవ్వింపు చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతున్నా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడం గమనార్హం.