: ఇప్పుడు ఆన్ లైన్ లో ఊపేస్తున్న హాట్ మ్యూజిక్ వీడియో ఇదే


పాప్ సంగీత ప్రపంచంలో విహరించే వాళ్ళకు నికీ మినాజ్ పేరు సుపరిచితమే. వంపులు తిరిగిన శరీరం, నిండైన సౌష్టవం, గోధుమరంగు మేనిఛాయతో... చూడగానే ఆకట్టుకుంటుందీ స్టార్ సింగర్. తాజాగా, ఈమె రూపొందించిన 'అనకొండ' మ్యూజిక్ వీడియో ఇప్పుడు ఆన్ లైన్లో ఊపేస్తోంది. నెట్లో విడుదలైన 24 గంటల్లో 19.6 మిలియన్ల మంది చూశారంటే అర్థం చేసుకోవచ్చు, ఈ పాటలో మినాజ్ అండ్ కో అంగాంగ ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో! ఆన్ లైన్ కు సంబంధించి ఇదో రికార్డు! ఇప్పటివరకు ఈ రికార్డు మరో గాయని మిలీ సైరస్ పేరిట ఉంది. సైరస్ విడుదల చేసిన 'రెకింగ్ బాల్' అనే సింగిల్ ను ఒక్కరోజులో 12.3 మిలియన్ల మంది వీక్షించారు. ఇప్పుడు 'అనకొండ'తో మినాజ్ కాస్తా సైరస్ ను వెనక్కినెట్టేసింది.

  • Loading...

More Telugu News