: పదవిలో ఉండగా...నోరు మెదపలేదేం?: రాయ్ పై కాంగ్రెస్ ఎదురు దాడి


‘‘పదవీ విరమణ దాకా ప్రభుత్వ సౌకర్యాలు అనుభవించడం, పదవి దిగగానే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మామూలైపోయింది’’ అంటూ కాగ్ మాజీ అధిపతి వినోద్ రాయ్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. బొగ్గు కుంభకోణంతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారాలకు సంబంధించి రూపొందిస్తున్న నివేదికల్లో కొందరి పేర్లను తొలగించాలంటూ యూపీఏ సర్కారు తనపై ఒత్తిడి చేసిందని రాయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ పైనా ఆయన నిందలేసేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఒక్కసారిగా భగ్గుమంది. ‘‘సంచలనాలకు రాయ్ కొత్తేమీ కాదు. అయినా నిన్నటిదాకా పదవిలో ఉండగా, నోరు మెదపని రాయ్, పదవి నుంచి రిటైర్ కాగానే, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సబబేనా? అయినా పదవిలో ఉండగా, వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాయ్ పై లేదా? పదవి దిగిపోగానే పుస్తకాలు రాయడం. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం ఫ్యాషన్ గా మారింది.’’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది మనీష్ తివారీ, రాయ్ పై విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News