: బదిలీ చేస్తే...రాజీనామా చేస్తా: మహారాష్ట్ర గవర్నర్
తనపై బదిలీ వేటు వేస్తే రాజీనామా చేస్తానని మహారాష్ట్ర గవర్నర్ శంకర నారాయణన్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర గవర్నరుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న శంకర నారాయణన్ ను మిజోరాం గవర్నరుగా బదిలీ చేస్తూ, శనివారం అర్ధరాత్రి రాష్ట్రపతి భవన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులు ఇంకా శంకర నారాయణన్ కు చేరలేదు. తన బదిలీపై వస్తున్న వార్తలపై శంకర నారాయణన్ కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘మిజోరాంకు బదిలీ చేస్తే రాజీనామా చేసేస్తా. బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు నాకు చేరలేదు. బదిలీ జరగదనే అనుకుంటున్నా. బదిలీ జరిగితే పదవిని పట్టుకుని వేలాడను’’ అంటూ ఆయన ఆదివారం మద్యాహ్నం ప్రకటించారు. మోడీ సర్కారు కూడా ఆశిస్తున్నదదేగా.