: వీళ్ళా సచిన్, ద్రావిడ్ వారసులు..?: బాయ్ కాట్
ఏడాది క్రితం అద్భుత ఫాంతో చెలరేగిన కోహ్లీ, పుజారా ఇప్పుడు పేలవ ఆటతో విమర్శకులకు పనిచెబుతున్నారు. ఇంగ్లండ్ గడ్డపై నాసిరకం ప్రదర్శనతో అభిమానులకు సైతం నిరాశ కలిగిస్తున్నారు. తాజాగా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్ బాయ్ కాట్ వీరిద్దరినీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కోహ్లీ, పుజారా... సచిన్, ద్రావిడ్ ల స్థానాలు భర్తీ చేస్తారని అందరూ భావించినా, అదంత తేలిక కాదన్న విషయం ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ద్వారా స్పష్టమైందని వ్యాఖ్యానించారు. వీరిద్దరూ పొరబాట్లను పునరావృతం చేస్తుండడమే వైఫల్యాలకు కారణమని విశ్లేషించారు. పైగా, ఇంగ్లండ్ గడ్డపై హై క్వాలిటీ సీమ్ బౌలింగ్ ను ఎదుర్కొనే క్రమంలో సాంకేతికత లోపించిందని విమర్శించారు.