: జగన్ పై పరిటాల సునీత మండిపాటు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ అసెంబ్లీలో దౌర్జన్యం, రౌడీయిజం చేయాలని ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు. జగన్ తీరు చూసి వైఎస్సార్సీపీ పార్టీ నేతలే సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ, ప్రజల సమస్యలేవీ లేనట్టు... కొట్లాటల్లో చనిపోయిన వారి గురించి అసెంబ్లీలో ప్రస్తావించడం సరికాదని హితవు పలికారు. పరిటాల రవి హత్యలో వైఎస్ కుటుంబం పాత్ర ఉందన్న విషయం ఎవరిని అడిగినా చెబుతారని సునీత అన్నారు.